📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసబ్ స్టేషన్ హై-వోల్టేజ్ యార్డ్ పక్కనే షటిల్ కోర్టు.. ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బంది

సబ్ స్టేషన్ హై-వోల్టేజ్ యార్డ్ పక్కనే షటిల్ కోర్టు.. ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బంది

📰 Generate e-Paper Clip

సబ్ స్టేషన్ హై-వోల్టేజ్ యార్డ్ పక్కనే షటిల్ కోర్టు.. ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బంది!

నిబంధనలు బేఖాతర్… లైవ్ వైర్ల కిందే ఆట స్థలం ఏర్పాటు!

షటిల్ కాక్ లైన్లకు తగిలితే భారీ ప్రమాదం జరిగే ముప్పు!

టిజిఎన్‌పిడిసిఎల్ అధికారులు స్పందించి తక్షణమే నిలిపివేయాలని నిలదీత!

వెంకటాపురం (నూగూరు), సెప్టెంబర్ 28 (మన ప్రజావాణి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని (33/11 కెవి) విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత ప్రమాదకరమైన రీతిలో షటిల్ కోర్టును ఏర్పాటు చేస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సబ్ స్టేషన్‌లోని లైవ్ వైర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, మరియు హై-వోల్టేజ్ ఐరన్ స్ట్రక్చర్స్‌కు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా ఈ ఆట స్థలాన్ని సిద్ధం చేయడం విద్యుత్ శాఖ అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
నిబంధనలు బేఖాతర్.. ప్రాణాలకే ముప్పు: విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం సబ్ స్టేషన్ యార్డ్ పరిసరాల్లోకి అనధికార వ్యక్తులకు ప్రవేశం నిషేధం. విధి నిర్వహణలో ఉండే సిబ్బంది కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ ఏకంగా లైవ్ కండక్టర్ల కిందే ఆటల కోసం నేలపై గీతలు గీసి కోర్టును నిర్మిస్తుండటం గమనార్హం. షటిల్ ఆడే సమయంలో కాక్ గాల్లోకి లేచి 33 కెవి లేదా 11 కెవి లైన్లను తాకితే ఊహించని రీతిలో భారీ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండే సమయాల్లో ఇండక్షన్ కారణంగా ఫ్లాష్ ఓవర్ ప్రమాదాలు జరిగే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి:
టిజిఎన్‌పిడిసిఎల్ నిబంధనలను తుంగలో తొక్కి, విధి నిర్వహణను పక్కనబెట్టి విద్యుత్ ప్రాణసంకటమైన వాతావరణంలో ఇలా ఆటల స్థలాన్ని నిర్మించడంపై ఉన్నతాధికారులు (డిఈ), (ఎస్ఈ) వెంటనే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే విచారణ జరిపి, ఈ ప్రమాదకరమైన పనులను నిలిపివేయించి సిబ్బంది ప్రాణాలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని వినియోగదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.