📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణస్మశాన వాటికలో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు

స్మశాన వాటికలో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు

📰 Generate e-Paper Clip

స్మశాన వాటికలో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు

• పట్టించుకోని విద్యుత్ అధికారులు, గ్రామ సర్పంచ్

హత్నూర, సెప్టెంబర్ 28: (తుర్కల ఖానాపూర్ ) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ గ్రామంలోని స్మశాన వాటికలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. మనుషులకు అందేంత తక్కువ ఎత్తులో కరెంట్ వైర్లు వేలాడుతూ ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్మశాన వాటికకు వచ్చే ప్రజలు, అంత్యక్రియలకు హాజరయ్యే బంధువులు ఈ వైర్ల కారణంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వైర్లను సరిచేసి, తగిన ఎత్తులో ఏర్పాటు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్ వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసి ప్రజలకు భద్రత కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.