ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ ప్రజావాణి వరకు పాదయాత్ర
••రోడ్లు, అనంతారం బ్రిడ్జి–ఓబులాపూర్ కెనాల్ పనులకై నాయకుల డిమాండ్.
సిరిసిల్ల, ప్రజావాణి
ఇల్లంతకుంట మండలంలోని రోడ్ల సమస్యలను పరిష్కరించాలని, అనంతారం బ్రిడ్జి–ఓబులాపూర్ కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.ఇల్లంతకుంట నుంచి ప్రారంభమైన పాదయాత్ర అనంతారం, రహీంఖాన్పేట్, వెల్జిపూర్ వల్లంపట్ల, ఓబులాపూర్ గ్రామాల మీదుగా సిరిసిల్ల కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం నాయకులు కలెక్టర్‌ను కలిసి సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు.
మండలంలోని అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని, అనంతారం బ్రిడ్జి, ఓబులాపూర్ కెనాల్ పనులను పూర్తి చేయాలని కోరారు. పనులు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు సురక్షితమైన బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ పాదయాత్రలో నాయకులతో పాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

