📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదూడల నాగరాజు మాతృమూర్తికి ఘన నివాళులు

దూడల నాగరాజు మాతృమూర్తికి ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

*దూడల నాగరాజు మాతృమూర్తికి ఘన నివాళులు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి):
యశ్వంతపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు దూడల నాగరాజు మాతృమూర్తి దూడల వీరలక్ష్మి హఠాన్మరణం చెందడం ఎంతో బాధాకరమని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోట్ల హరీష్ తెలిపారు.

గ్రామంలో వీరలక్ష్మి ప్రేమ, అనురాగాలతో, ఆప్యాయతతో అందరితో కలిసి మెలిసి ఉండేవారని, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ పలకరించే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఆమె మరణ వార్త విన్న గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని, ఆమె లేని లోటు గ్రామానికి తీరనిదని అన్నారు.
ఆమె జ్ఞాపకాలు గ్రామంలో చిరస్థాయిగా నిలుస్తాయని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అనంతరం వారి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సంతాప కార్యక్రమంలో జనగామ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మచ్చ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి కందాల చంద్రశేఖర్, గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు గడ్డం రవి, వార్డు సభ్యులు, గ్రామ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.