📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

దళిత జర్నలిస్టుల పోరం సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు కర్రోళ్ల నవజీవన్

సి ఐ రమేశ్, ఎస్సై అపూర్వ రెడ్డి చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల

మద్దూరు సెప్టెంబర్28, ప్రజా వాణి,

వచ్చే నెల 07 వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దళిత జర్నలిస్టుల పోరం 11 వ రాష్ట్ర మహాసభను విజయవంతం చెయాలనీ దళిత జర్నలిస్టుల పోరం జిల్లా అధ్యక్షులు నవజీవన్ పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్లో సి ఐ రమేశ్,ఎస్సై అపూర్వ రెడ్డి చేతుల మీదుగా వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు కర్రోళ్ల నవజీవన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్టంలో దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి రావాల్సిన న్యాయమైన డిమాండ్స్ గురించి మేము పోరాడుతున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడెషన్ కార్డులు మంజూరు చేయాలి,దళిత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కోరారు. దళిత జర్నలిస్టులకు అభయ హస్తం పథకం కింద సబ్సిడీ రుణాలు మంజురు చెయాలనీ డిమాండ్ చేశారు. అక్రిడెషన్ కమిటీలో దళిత జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలలో జరిగే మహాసభకు దళిత జర్నలిస్టుల సోదరులు పెద్ద ఎత్తుల హాజరు కావాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా నాయకులు పాకాల జాకబ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.