📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బీజేపీ మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులకు సన్మానం

బీజేపీ మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులకు సన్మానం

📰 Generate e-Paper Clip

*బీజేపీ మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులకు సన్మానం*

*జిల్లా కమిటీలో వివిధ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట్ నాయకులకు అభినందనలు తెలిపిన బిజెపి శ్రేణులు*

ఎల్లంపేట్: (ప్రజా వాణి) బీజేపీ మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా కమిటీలో ఎల్లంపేట్ మున్సిపాలిటీకి చెందిన పలువురు మహిళా నాయకులకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులను బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు, ఎల్లంపేట్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గౌరారం జగన్ గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ తదితరులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఎల్లంపేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రజిత దేవేందర్ రెడ్డికి మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలిగా, అర్చన శ్రీనివాస్ ముదిరాజ్‌కు మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్‌గా, శారద రాజు నాయక్‌కు కో-కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. అలాగే మహేశ్వరి రాజేష్‌ను జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా, పుష్ప మల్లారెడ్డిని ఎల్లంపేట్ మున్సిపాలిటీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించారు.

నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోచయ్య, ముదిరాజ్ నాయకులు జీఎస్ కంచు గంట మహేశ్, రవి నాయక్, లక్ష్మణ్, రాజు నాయక్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.