📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅప్పనపల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రారంభం..

అప్పనపల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రారంభం..

📰 Generate e-Paper Clip

అప్పనపల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రారంభం..

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత – ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

దుబ్బాక మండలంలోని అప్పనపల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.అప్పనపల్లి,తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రధాన కూడళ్లు, ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలపై నిరంతర నిఘా ఉండే అవకాశం కలుగుతుందని తెలిపారు.ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకున్నప్పుడు సంబంధిత వివరాలను గుర్తించడంలో కూడా ఈ నిఘా వ్యవస్థ ఉపయోగపడుతుందని అన్నారు.ప్రజల భద్రత, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు. ప్రజల సహకారంతో గ్రామాలను మరింత సురక్షితంగా, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో SCST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.