డబిల్‌పూర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం
సహారా యూత్ ఆధ్వర్యంలో అన్నదానం.. ఉత్సాహంగా లడ్డూ వేలంపాట
డబిల్‌పూర్: (ప్రజావాణి):- ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో సహారా యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, రాత్రి గణనాథుని నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు
నిర్వహించి భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మండప నిర్వాహకులు ముఖ్య అతిథులు, బస్తీ వాసులు, పెద్దలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఉత్సాహంగా లడ్డూ వేలంపాట
వినాయకుడి లడ్డూ వేలంపాట కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ వేలంపాటలో గంగాధరి శ్రీనివాస్ లడ్డూను దక్కించుకున్నారు. దీంతో మండపం వద్ద భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
భక్తిశ్రద్ధలతో నిమజ్జనం
అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య గణనాథుని నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

