📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పలాస పురుషోత్తపురంలో ఘనంగా లడ్డూ వేలము పాట...

పలాస పురుషోత్తపురంలో ఘనంగా లడ్డూ వేలము పాట…

📰 Generate e-Paper Clip

పలాస పురుషోత్తపురంలో ఘనంగా లడ్డూ వేలము పాట…

రూ.1,02,000 లకు లడ్డూ కైవసం చేసుకున్న బళ్ల ఆనంద్ దంపతులు.

పలాస, ప్రజావాణి ప్రతినిధి

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని పురుషోత్తపురం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో ఆదివారం లడ్డూ వేలం పాటను నిర్వహించారు.భక్తుల కోలాహలం, భక్తి ఉత్సాహం నడుమ జరిగిన ఈ వేలం పాటలో పలువురు భక్తులు పోటీపడ్డారు. చివరకు పలాస-కాశీబుగ్గ మున్సిపల్ మాజీ చైర్మన్ బళ్ల గిరిబాబు సోదరుడు బళ్ల ఆనంద్, ఆయన సతీమణి సుజాత దంపతులు రూ.1,02,000లకు లడ్డూను సొంతం చేసుకున్నారు.లడ్డూను దక్కించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని,స్వామి వారి కృపతో తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా బళ్ల ఆనంద్ దంపతులు తెలిపారు.అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించి, లడ్డూను అందజేశారు.ఈ కార్యక్రమంలో పురుషోత్తపురం వీధి యువకులు,ఉత్సవ కమిటీ సభ్యులు, వీధి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.