📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమద్దూరు ఐ కె పిలో లక్షలు వెచ్చించారు.... లక్షణంగా వదిలేశారు

మద్దూరు ఐ కె పిలో లక్షలు వెచ్చించారు…. లక్షణంగా వదిలేశారు

📰 Generate e-Paper Clip

మద్దూరు ఐ కె పిలో లక్షలు వెచ్చించారు…. లక్షణంగా వదిలేశారు

మద్దూరు ఐ కె పి అధికారుల నిర్లక్ష్యం

మద్దూరు సెప్టెంబర్ 28, ప్రజా వాణి,

మద్దూరు ఇందిరా క్రాంతి పధకం కార్యాలయంలో నుండి సుమారు 12లక్షలు వెచ్చించి ట్రాక్టర్ ను కొనుగోలు చేశారు. దీంతో కార్యాలయం ముందు అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. ట్రాక్టర్ ను ఎవరికైనా రెంటుకు ఇచ్చి డబ్బులు సమకూర్చి లాభాలు దండుకుందామనుకున్న ఐ కె పి అధికారుల ఆలోచన నష్టాలు తెచ్చి పెట్టింది. ఇద్దరు ముగ్గురు రెంటుకు తీసుకొని డబ్బులు చెల్లించకుండా వెలుగు సిబ్బందికి అప్పగించారు. రెంటుకు తీసుకున్న వారి నుండి ఎలాంటి రెంటు వసూలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడముతో కార్యాలయం షో కేసులో పెట్టిన బొమ్మలా అందరికీ దర్శనమిస్తుంది. దీంతో ఐ కె పి నిధులు దుర్వినియాగం చేస్తూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. తక్షణమే ఎటువంటి వినియోగం లేని ట్రాక్టర్ ను అమ్మకానికి పెట్టీ నిధులు ఐ కె పి లో జమ చేయాలని పలువురు మండల నాయకులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.