జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.. భారీగా హాజరైన గ్రామ ప్రజలు
మేడ్చల్: (ప్రజావాణి)
జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డబిల్ పూల్ గ్రామ మాజీ సర్పంచ్ రాజా మల్లా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరై అన్నదాన వితరణ చేశారు.
ఈ సందర్భంగా జై భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు
అన్నదాన వితరణ చేయగా, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
సామాజిక సేవలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

