📄 ePaper
Epaper 2
Sunday, September 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ప్రతి అర్హుడూ భాగస్వామి కావాలి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ప్రతి అర్హుడూ భాగస్వామి కావాలి

📰 Generate e-Paper Clip

 

*పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి*

తొర్రూర్
సెప్టెంబర్ 27

పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ యువత, ఉద్యోగులు, విద్యావంతులందరూ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమంలో తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, 2027 మార్చిలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియ సెప్టెంబర్ 28, 2026 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోని తద్వారా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు.
ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు కూడా కొత్త ఫారం–18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయాలని ఆమె సూచించారు.
దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన ధృవపత్రాలు, అవసరమైన సర్టిఫికెట్ల ధృవీకరించిన ప్రతులను జత పరచాలన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన గ్రాడ్యుయేట్ ఈ నమోదు ప్రక్రియను గమనించి, గడువులోగా తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ,విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.