*రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*
ప్రజావాణి, సూర్యాపేట బ్యూరో సెప్టెంబర్ 27 :
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా బీజేపీ పాలకులు ప్రజలను మోసం చేస్తూ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఓట్ల చోరీ ఎలా జరుగుతుందో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు వివరించారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాలను గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కంకణబద్ధులై పనిచేస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
RELATED ARTICLES

