*వినాయక నిమజ్జనంలో పాల్గొన్న చామకూర మహేందర్ రెడ్డి*
*రూ.2.10 లక్షలకు మహదేవ్ యూత్ లడ్డూ వేలం.. ఈగల్స్ యూత్ లడ్డూ రూ.1.01 లక్షలు*
మేడ్చల్, ప్రజావాణి:- మేడ్చల్ నియోజకవర్గంలోని పూడూర్–కిష్టాపూర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబు యాదవ్, నాయకులు శేఖర్ రెడ్డి, వెంకటేష్, కృష్ణ, శశికుమార్, శ్రీకాంత్, సుశాంత్ తదితరులు పూడూరులోని పలు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొన్నారు.
*రూ.2.10 లక్షలకు లడ్డూ వేలం*
పూడూరులో మహదేవ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ వేలం పాటలో గ్రామ యువకుడు పరమేష్ గౌడ్ రూ.2 లక్షల 10 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈగల్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో కాంట్రాక్టర్ రాంచందర్ రూ.1,00,116లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం భక్తుల 
కోలాహలం, యువకుల ఉత్సాహం మధ్య వినాయక నిమజ్జన ఊరేగింపులను వైభవంగా నిర్వహించారు.

