📄 ePaper
Epaper 2
Sunday, September 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamవచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి

వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి

📰 Generate e-Paper Clip

వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి…!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

వచ్చే మార్చి కల్లా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను క్షేత్ర స్థాయిలో డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ లతో కలిసి పరిశీలించారు.

నిర్మాణాల్లో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయిందన్నారు. ఆకాడమిక్ 3, 4 బ్లాకుల ఫ్రoట్, బ్యాక్ వింగ్ లు పూర్తయినట్లు, 1, 2 బ్లాకుల్లో బ్యాక్ వింగ్ పూర్తి అవగా,
ఫ్రoట్ వింగ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

సీనియర్ హాస్టళ్లు 9 లో 3 హాస్టళ్లు పూర్తవగా, 2 హాస్టళ్ల నిర్మాణం పురోగతిలో ఉండగా, 4 హాస్టళ్ల నిర్మాణాలు బేస్ మెంట్ వరకు జరిగాయని అన్నారు. జూనియర్ 4 హాస్టళ్లకు సంబంధించి నిర్మాణాలు పూర్తయినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణం స్లాబ్ పూర్తయినట్లు, కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణాలు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.

నిర్మాణ పనుల్లో ఎక్కడ ఆలస్యం అలసత్వం ఉండకూడదని గుత్తేదారులకు, అధికారులకు తెలిపారు. యంగ్ ఇండియా పాఠశాల పనులను మరింత వేగవంతం చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. నిర్మాణ కార్మికుల సంఖ్యను పెంచుకుని, పనులను మరింత వేగవంతం చేసి, మార్చి కల్లా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలన్నారు.

నిర్మాణంలో ఉన్న తరగతి గదులను, హాస్టల్ సముదాయాలను, సైన్స్, కంప్యూటర్స్ ఇతర ల్యాబ్ భవనాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. కిచెన్, డైనింగ్ హాల్ లో జరుగుతున్న నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతుందని, ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు.
అన్ని వర్గాల ప్రజలు ఒకే చోట విద్యను అభ్యసిస్తే వసుదైక కుటుంబ భావన అందరిలోనూ ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, విద్యాశాఖ ఇఇ బుగ్గయ్య, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ ఎస్ ఈ యుగంధర్ రావు, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, సిపిఓ ఏ. శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.