📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడు నేడు మంచానికే పరిమితం

జిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడు నేడు మంచానికే పరిమితం

📰 Generate e-Paper Clip

*జిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడు నేడు మంచానికే పరిమితం – గుండె ఆపరేషన్ కు సాయం కోసం ఎదురుచూపు*

*జనగామ జిల్లా ఉద్యమకారుడు ఇరుగు రమేష్ ఆర్థిక కష్టాల్లో – దాతల సహాయం కోసం వేడుకోలు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి):
ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలాడు.. జిల్లా కోసం టవర్ ఎక్కాడు.. జైలుకెళ్లాడు.. నేడు అదే ఉద్యమకారుడు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నాడు. ఆయనే జనగామ జిల్లా ఉద్యమకారుడు ఇరుగు రమేష్.

తన తల్లిదండ్రులను కోల్పోయి, ప్రస్తుతం పెయింటింగ్ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న రమేష్ కు గుండె సంబంధిత సమస్యతో గాంధీ హాస్పిటల్ లో చేరాడు. సోమవారం ఉదయం 9 గంటలకు హార్ట్ ఆపరేషన్ నిర్వహించనున్నారు.

ఆపరేషన్ కు రూ. 20,000 అవసరం కాగా, చేతిలో చిల్లిగవ్వ లేక దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. తోటి ఉద్యమకారుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్థానికులు కోరుతున్నారు.

దయగల దాతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు సహృదయంతో స్పందించి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి.

*సాయం చేయదలచిన వారు:*
*ఇరుగు రమేష్ – PhonePe నంబర్: 8686875034*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.