📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ దీపక్...

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

📰 Generate e-Paper Clip

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన

జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ప్రజా వాణి, వికారాబాద్ జిల్లా, సెప్టెంబర్26:
శనివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు నందు బీసీ వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు,పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు.అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.సామాజిక న్యాయం,సమానత్వం కోసం చాకలి ఐలమ్మ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ సూచించారు.ఆమె ఆశయాలు,పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైని కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటూరు, బిసి వెల్ఫేర్ అధికారి మాధవ రెడ్డి, విద్యా శాఖ ఆదికారి అబ్దుల్ ఘని, డిపిఆర్ఓ చెన్నమ్మ, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.