📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణడీజేఎఫ్ రాష్ట్ర 11వ మహాసభలపై సమీక్ష సమావేశం

డీజేఎఫ్ రాష్ట్ర 11వ మహాసభలపై సమీక్ష సమావేశం

📰 Generate e-Paper Clip

డీజేఎఫ్ రాష్ట్ర 11వ మహాసభలపై సమీక్ష సమావేశం

• నాయకులకు దిశానిర్దేశం చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్

సంగారెడ్డి, సెప్టెంబర్ 27: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

తెలంగాణ దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) తెలంగాణ రాష్ట్ర 11వ మహాసభల నిర్వహణకు సంబంధించి శనివారం సంగారెడ్డిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రమణి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీజేఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ ముఖ్య అతిథిగా హాజరై మహాసభల ఏర్పాట్లను సమీక్షించారు.

మహాసభల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై కాశపోగు జాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో దళిత జర్నలిస్టులు ప్రతినిధులుగా హాజరుకానున్నారని తెలిపారు. మహాసభలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

మహాసభలను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యక్రమ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, ఉపాధ్యక్షుడు ప్రకాష్, జిల్లా సలహాదారు మీనంపల్లి కిషన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్, జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న, కార్యనిర్వాహక కార్యదర్శి వరిగుంతం శంకర్, ఉపాధ్యక్షుడు దశరత్, మోహన్, బుచ్చయ్య, మద్దెల పోచయ్య, ఆవుల మల్లేశం, దాసు, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.