📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తి

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తి

📰 Generate e-Paper Clip

*కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తి*

*ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు*

*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి):
సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

ఆదివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం బాపూజీ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం బాపూజీ సాగించిన ఉద్యమం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి విశేషమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.

అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభి గౌడ్, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధికారులు అందరూ పాల్గొని, కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య, ఇతర కుల సంఘాల సభ్యులు, జిల్లా అధికారులు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.