📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల నాకు అపార గౌరవం ఉంది

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల నాకు అపార గౌరవం ఉంది

📰 Generate e-Paper Clip

*డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల నాకు అపార గౌరవం ఉంది – భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి*

జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 27(ప్రజావాణి):

జనగామ నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆ సమయంలో కార్యక్రమ సందడిలో, తొందరపాటులో పాదరక్షలు (చెప్పులు) విడవకుండానే విగ్రహం వద్దకు వెళ్లడం అనుకోకుండా జరిగింది. అయితే వెంటనే నా పొరపాటును గ్రహించి, పాదరక్షలు తొలగించి ఆ మహనీయునికి భక్తిశ్రద్ధలతో ప్రణామాలు అర్పించాను.

మహానాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనకు ప్రసాదించిన పవిత్ర రాజ్యాంగం, ఓటు హక్కు ఫలితంగానే సాధారణ రైతు బిడ్డనైన నేను ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాసేవ చేసే అవకాశం పొందాను. లోక్ సభ ఎన్నికల సమయంలో నా దళిత సోదర సోదరీమణులందరూ నన్ను తమ సొంత మనిషిగా ఆదరించి, అక్కున చేర్చుకొని అపారమైన ప్రేమతో, భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ మహనీయుని సిద్ధాంతాలు, ఆశయాలే నన్ను నిరంతరం నడిపించే మార్గదర్శకాలు.

తొందరపాటులో, అనుకోకుండా జరిగిన ఈ చిన్న పొరపాటును దళిత సోదరులు, ప్రజలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా మనసులో ఆయన పట్ల ఉన్న అపారమైన గౌరవాన్ని స్మరిస్తూ, జరిగిన సంఘటనకు నా హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను.

నా జీవితాంతం దళిత, బహుజనుల సంక్షేమానికి, అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నాను.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.