📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రహదారుల అభివృద్ధికి రూ.5.20 కోట్ల నిధులు మంజూరు

రహదారుల అభివృద్ధికి రూ.5.20 కోట్ల నిధులు మంజూరు

📰 Generate e-Paper Clip

రహదారుల అభివృద్ధికి రూ.5.20 కోట్ల నిధులు మంజూరు

ఎంపీ ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి

మేడ్చల్ (ప్రజావాణి):-

మేడ్చల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో హెచ్‌ఎండీఏ ద్వారా వివిధ రహదారి అభివృద్ధి పనులకు మొత్తం రూ.5.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆమె వెల్లడించారు.

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం గ్రామం మీదుగా జిల్లా పరిధిలోని శ్రీరంగవరం ఉన్నత పాఠశాల వరకు బీటీ రోడ్డు విస్తరణ, పటిష్టత పనులకు రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల బండమాదారం, శ్రీరంగవరం పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా దేవరయాంజాల్ పరిధిలోని మందాయిపల్లి రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ఎగ్జిట్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.20 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో స్థానిక ప్రజలకు, వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.

నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. రహదారుల విస్తరణ, పటిష్టతతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతూ రహదారి పనులకు నిధులు మంజూరు చేయించిన ఎంపీ ఈటల రాజేందర్‌కు ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.