📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKamareddyఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1977–2026 స్వర్ణోత్సవ వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రిసోర్స్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రతినిధుల సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సంఘం నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ స్వర్ణోత్సవాల సభలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్, రాష్ట్ర కార్యదర్శి ఎన్. నర్సింలు, కొత్తబాద్ మాజీ సర్పంచ్ సాయిలు, బాన్సువాడ డివిజన్ ఉపాధ్యక్షులు మన్నె చిన్న సాయి, జిల్లా ఉపాధ్యక్షులు గైని రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, హక్కుల సాధన మార్గంలో సంఘం ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రస్థానం ప్రాధాన్యతను వివరించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతను చైతన్యపరిచేందుకు సంఘం మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అనంతరం సంఘం భవిష్యత్ కార్యాచరణ, సామాజిక సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, యువత భాగస్వామ్యం తదితర అంశాలపై ప్రతినిధుల సభలో చర్చించారు. స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని సంఘం నాయకులు, ప్రతినిధులు పరస్పరం అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.