📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మేడ్చల్ సిఎస్ఐ వెస్లీ చర్చిలో 80వ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే వేడుకలు

మేడ్చల్ సిఎస్ఐ వెస్లీ చర్చిలో 80వ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే వేడుకలు

📰 Generate e-Paper Clip

మేడ్చల్ సిఎస్ఐ వెస్లీ చర్చిలో 80వ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే వేడుకలు

మహిళల ప్రాధాన్యతపై ప్రత్యేక సందేశం.. ఐక్యత, సేవాభావానికి పిలుపు

మేడ్చల్: మేడ్చల్‌లోని సిఎస్ఐ వెస్లీ చర్చిలో 80వ సి ఎస్ ఐ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే సర్వీస్ కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశం నిర్వహించి, క్రైస్తవ ఐక్యత, సేవాభావం, సమాజంలో మహిళల పాత్ర ప్రాధాన్యతను వివరించారు.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న సీఎస్ఐ ఫార్మేషన్ డేను నిర్వహిస్తారు. 1947 సెప్టెంబర్ 27న దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రొటెస్టంట్ సంప్రదాయాల ఐక్యతతో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సి ఎస్ఐ) ఏర్పడింది. క్రైస్తవ ఐక్యత, సమిష్టి సేవకు ఈ రోజును ప్రతీకగా జరుపుకుంటారు.
ఉమెన్స్ సండే సందర్భంగా ఎం.శ్రీలత దేవుని వాక్యాన్ని బోధించారు. దేవుడిని నమ్మకంగా, నిర్భయంగా విశ్వసించే మహిళల ప్రాముఖ్యతను వివరిస్తూ, చర్చి మరియు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎం.జోసెఫ్ కిషోర్, ప్రెస్‌బైటర్ ఇన్‌ఛార్జి, చర్చి ఆఫీస్ బేరర్లు, పాస్టోరేట్ కమిటీ సభ్యులు, మనోహరాబాద్ సిఎస్ఐ చర్చి, మేడ్చల్ చర్చి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ప్రార్థనలు, ఫెలోషిప్‌తో కార్యక్రమం ముగిసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.