చిలుకూరు సెప్టెంబర్ 27(ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చిలుకూరు మండలం చెన్నారిగూడెం గ్రామానికి చెందిన చిలుకూరు మండల పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పిండాత్రి హనుమంతరావు అన్నారు. ఆదివారం చెన్నారిగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ కార్డులను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లబ్ధిదారుల పూర్తి వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. స్మార్ట్ కార్డులు పొందిన లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నారిగూడెం గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పుట్టపాక వెంకయ్య,కొవ్వూరు ఓబయ్య మాజీ సర్పంచ్, కొవ్వూరు వెంకటేశ్వర్లు,కాంపాటి సాయమ్మ,కమతం కొండలు,మండల పార్టీ యూత్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మీనారాయణ,కమతం నాగరాజు,కొవ్వూరి వెంగయ్య,సూరేపల్లి నాగరాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : పిండ్రాతి.హనుమంతరావు
RELATED ARTICLES

