📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఉపసర్పంచి పార్టీ మారడం దురదృష్టకరం.

ఉపసర్పంచి పార్టీ మారడం దురదృష్టకరం.

📰 Generate e-Paper Clip

ఉపసర్పంచి పార్టీ మారడం దురదృష్టకరం..

పదవికి రాజీనామా చేసి నిబద్ధత చాటుకోవాలి

కాంగ్రెస్ మండల శాఖ
ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన ఉపసర్పంచి సత్తుత్తూరి యాదగిరి బి ఆర్ఎస్ లో చేరడం పై కాంగ్రెస్ మండల శాఖతో పాటు నాయకులు స్పందించారు.ఈ మేరకు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కూరెళ్లి సతీష్,దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు,వార్డు సభ్యులు నద్దునూరి ప్రశాంత్ మాట్లాడుతూ ఉప సర్పంచి సత్తురి యాదగిరి కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి వెళ్లడం దురదృష్టకరమన్నారు.ప్రజలు ఇచ్చిన పదవికి, వార్డు ప్రజల విశ్వాసానికి గౌరవం ఇచ్చి తన పదవికి రాజీనామా చేసి తిరిగి వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలిచి తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని సూచించారు.ఒక వ్యక్తి పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగదని, ఇనుగుర్తి తో పాటు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు.ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మండల పార్టీ తో పాటు స్థానిక నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎ ఎం సి డైరెక్టర్ కొట్టం రాము, వార్డు సభ్యులు శ్రీకాంత్, బూర ఇస్తారి, సీనియర్ నాయకులు ఇస్లావత్ చందు,మామిడి జనార్ధన్, కుంచాల రమేష్, కొణతం రాములు,మహంకాళి సలీం,సురేష్, కొలిపాక నారాయణ, కొణతం ప్రభాకర్, నాగేల్లి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.