📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamఖమ్మం జిల్లాలో "ప్రజావాణి" ప్రకంపనలు...?

ఖమ్మం జిల్లాలో “ప్రజావాణి” ప్రకంపనలు…?

📰 Generate e-Paper Clip

ఖమ్మం జిల్లాలో “ప్రజావాణి” ప్రకంపనలు…?



ముదిగొండ “మల్లారం” జిపిఓపై వెల్లువెత్తుతున్న విమర్శలు…?


*వైరాలో రేషన్ కార్డు.. ఆపై దర్జాగా రేషన్ బియ్యం…?

*ఇటీవల రేషన్ కార్డు తొలగించినట్లు అనుమానం…?

*జిల్లాలో మసకబారుతున్న రెవెన్యూ శాఖ….?

*ప్రజావాణి కథనాలపై తెగ ఆరాలు తీస్తున్న కొందరు…?


ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా రెవెన్యూ శాఖలో ఓ జి పి ఓ నిర్లక్ష్యం అధికార దుర్వినియోగం ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ రాయితీలు పొందుతున్నట్లు ఆ మేరకు వైరా లో రేషన్ కార్డు నెంబర్ 36 54 68 8 292 ప్రకారం రేషన్ కార్డును కలిగి 22 43 0 0 7 రేషన్ షాపు నందు ఇటీవల మూడు నెలల బియ్యం పొందినట్లు మన ప్రజావాణి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో కొందరు ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవల ఖమ్మం జిల్లా ముదిగొండ మల్లారం జిపిఓ పనితీరుపై కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో మన ప్రజావాణి తెలుగు దినపత్రిక సమగ్ర వివరాలతో సంచలన కథనం అందించిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా పాఠకులకు అధికార యంత్రాంగానికి తెలిసిందే. ఈ వార్త కథనం పట్ల పలువురు ఆరా తీసినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలుగా కొందరు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా గ్రూపుల్లో షేర్ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన సదరు జిపిఓ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రేషన్ కార్డును కలిగి ప్రభుత్వ లబ్ధి పొందుతున్నట్లు కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ మహిళకు చెందిన ధృవీకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. దీంతో సదరు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల ముదిగొండ తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు అందించినట్లు తెలిసింది. కాగా మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మల్లారం తో పాటు చింతకాని మండలం రెండవ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై పలు ఆరోపణలు విమర్శలు ఇటీవల వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మధిర నియోజకవర్గం లోని ముదిగొండ చింతకాని మండలాలలో కొందరు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతర అవసరాల కోసం ప్రజలు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించిన నేపథ్యంలో పెండింగ్లో పెడుతున్నట్లు కొందరు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ముదిగొండ చింతకాని మండలాలలో రెవెన్యూ శాఖ అధికారుల తీరుపై పలు విమర్శలు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి వాస్తవాలను నిగ్గు తేల్చి సంబంధిత రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ముదిగొండ చింతకాని మండలాల ప్రజలు బాధితులు ఒక ప్రకటనలో కోరుతున్నారు.

*మరి కొన్ని సమగ్ర వివరాలతో పాటు అధికారుల వివరణలతో రేపటి కథనం…3లో వేచి చూడండి…!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.