📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamసంఘం నుంచి తొలగించడం బాధాకరం...!

సంఘం నుంచి తొలగించడం బాధాకరం…!

📰 Generate e-Paper Clip

సంఘం నుంచి తొలగించడం బాధాకరం..!

విలేకరుల సమావేశంలో పి కోట్యా నాయక్ ఆవేదన.

4 టన్నుల చేపలు వేట కొనసాగింది..

పాలకవర్గం రద్దు చేయాలంటూ డిమాండ్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం మత్స్య సొసైటీలో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని సంఘం అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరిస్తూ మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు సంఘం సభ్యుడు పి కోట్యా నాయక్ శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ అవినీతిని ప్రశ్నించి నందుకు సంఘం కార్యకలాపాలలో పాల్గొనకుండా సస్పెండ్ చేసినట్లు ఆయన అన్నారు. తనతోపాటు మరో ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినట్లు ఆరోపించారు. చేపల చెరువును అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు ఖమ్మం సిటీలో విలాసవంతమైన భవనాలు నిర్మించినట్లు ఆయన ఆరోపించారు. గతంలో సాదాసీదా జీవితం గడిపిన సదరు సంఘం అధ్యక్షుడు చేపల చెరువును అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మత్స్యకారుల వద్ద సభ్యత్వాల కోసం వేలాది రూపాయలు వసూలు చేసి సభ్యత్వాలు కల్పించి నిబంధనలను పట్టించుకోకుండా చేసినట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఇప్పటికైనా ప్రభుత్వం కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా సుమారు నాలుగు టన్నుల చేపల వేట కొనసాగించినప్పటికీ నేటికి మత్స్యకారులకు నగదు పంపిణీ చేయలేదని ప్రతిసారి మోసం చేస్తున్నట్లు ఆయన తీవ్రంగా అగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.