పశువుల ఆసుపత్రి ముందు 40 మీటర్ల సీసీ ర్యాంపు నిర్మించాలి:బి గోపాల్
అనంతపురం (ప్రజావాణి) సెప్టెంబర్26 కూడేరు మండల పరిధిలోని చోళసముద్రం గ్రామంలో ఉన్న పశువుల ఆసుపత్రి ముందు సుమారు 40 మీటర్ల పొడవున సీసీ ర్యాంపు నిర్మించాలని బీజేపీ మండల అధ్యక్షులు బి. గోపాల్ కోరారు.
పశువుల ఆసుపత్రికి వచ్చే రైతులు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆసుపత్రి ముందు రహదారి సక్రమంగా లేకపోవడంతో వర్షాకాలంలో బురద, నీరు నిలిచి పశువులను ఆసుపత్రికి తీసుకురావడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలు, పశుపోషకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు స్పందించి 40 మీటర్ల సీసీ ర్యాంపును నిర్మించి, ఆసుపత్రికి రాకపోకలు సులభతరం చేయాలని బి. గోపాల్ కోరారు. ఈకార్యక్రమంలో గ్రామ నాయకులు. గోవిందరాజులు. సంజీవ నాయక్.సుధాకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు

