*వినాయక మండలి ఆధ్వర్యంలో అన్నదానం*
* *మన ప్రజావాణి* మందమర్రి:-
పట్టణంలోని ఎస్వి టెంపుల్ ఏరియాలో ఓం శ్రీ వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లు ఐక్యమత్యంతో ఏరియాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించు కోవడం విశేషం. ఏరియాలోని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసిగా వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఈసందర్భంగా వినాయక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మతసామరస్యాలకు ప్రతీకగా హిందూ, ముస్లింలు ఐక్యమత్యంతో వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సంవత్సరం విగ్రహ దాతగా బబ్బెర విజయ్ కుమార్ – భాగ్యలక్ష్మి దంపతులు, బండి విక్రమ్ – శ్రీలక్ష్మి దంపతులు సంయుక్తంగా నిలిచారు.
*వైభవంగా గణనాథుని శోభయాత్ర*
గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని ఎస్వి టెంపుల్ ఏరియాలో ఓం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి అంగరంగ వైభవంగా బయలుదేరి వెళ్లారు. అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహించి, అనంతరం గణేశుని సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. అంతకుముందు తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథునికి గణేష్ మండలి ఆధ్వర్యంలో నిమజ్జనాన్ని పునస్కరించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గణేష్ మండప కమిటీల ఆధ్వర్యంలో మండపాల వద్ద నవరాత్రులు పూజలందుకున్న గణనాధుని చేతిలోని లడ్డు, కలశం, నకు వేలంపాట నిర్వహించగా, వాటిని సొంతం చేసుకునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు. ఈ వేలంపాటలో గణేశుని లడ్డును కాలనీకి చెందిన జాడ కీర్తి కుమార్ – ఆర్తి దంపతులు కైవసం చేసుకోగా, కలశాన్ని బండి విక్రమ్ – శ్రీలక్ష్మి దంపతులు దక్కించుకున్నారు. అనంతరం గణనాధుని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గణనాథుని ఊరేగింపుల సందర్భంగా చిన్నారులు, యువకులు, మహిళలు ఆనందంగా నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారుల, యువకుల,మహిళల నృత్యాలు, కోలాటాలతో పట్టణం, మండలంలోని గ్రామాలు సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో వినాయక మండలి కమిటీ సభ్యులు జాడ క్రాంతి కుమార్, మహ్మద్ ఖాసీం, కిందింటి కుమార్, దేశమల్ల సిద్దార్థ, భీమా గణేష్, జాడ కీర్తీ కుమార్, బబ్బెర విజయ్, నన్నపురాజు శ్యాంసుందర్,మేకల అరుణ్, ఐలవేని ఈశ్వర్, భీమా గణేష్, రాజు శర్మ, శివ శర్మ, మహిళలు, భక్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

