📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonపాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో మహా గణపతి హోమం

పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో మహా గణపతి హోమం

📰 Generate e-Paper Clip

*పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో మహా గణపతి హోమం – అనంతరం అన్నవితరణ..*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో మహా గణపతి హోమం నిర్వహించారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన ఈ హోమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి , రాజరామ్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా గణపతి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించారు.

హోమం అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్నవితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు స్వయంగా భక్తులకు, నాయకులకు, కార్యకర్తలకు అన్నప్రసాదాన్ని వడ్డించి ఆప్యాయంగా సేవలందించారు. భక్తులతో కలిసి ప్రసాదాన్ని పంచుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ పుణ్య కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గణేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా గణపతి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.