కోదాడలో శనివారం మెగా జాబ్ మేళా:
ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్.
కోదాడ,సెప్టెంబర్ 18/ప్రజావాణి కోదాడ పట్టణంలోని సి.సి. రెడ్డి కాన్వెంట్ లో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో శుక్రవారం పర్యవేక్షించారు.ఈ సందర్భంగా వారు జాబ్ మేళా నిర్వహణ ప్రాంగణాన్ని, స్టాళ్లను, అభ్యర్థుల రిజిస్ట్రేషన్ కౌంటర్లను మరియు ఇంటర్వ్యూ గదులను నిశితంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. జాబ్ మేళాకు భారీ సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నిరుద్యోగులకు కార్పొరేట్ మరియు ప్రముఖ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే సత్సంకల్పంతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ, జాబ్ మేళా విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సాయం, మరియు శాంతిభద్రతల పరిరక్షణ వంటి ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కాన్వెంట్ యాజమాన్యం మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కోదాడలో శనివారం మెగా జాబ్ మేళా:
RELATED ARTICLES

