గుగ్గిళ్లలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన-సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య
బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజాపాలన స్ఫూర్తితో గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లావణ్య మోహన్, వార్డు సభ్యులు కొంకటి సంపత్, కొంకటి కుమార్, కొంకటి సురేష్, పోతూ భూలక్ష్మి,పంచాయితీ కార్యదర్శి వంశీ,కారోబార్ అశోక్, వీవోఏలు లక్ష్మణ్, భాగ్య, అంగన్వాడీ టీచర్ శోభ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

