📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

*తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ*

*సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ నాయకులు*

మేడ్చల్, సెప్టెంబర్ 17 (ప్రజా వాణి):
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేడ్చల్ బీజేపీ ఉపాధ్యక్షుడు చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాత్రిక లక్ష్మణ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ దినోత్సవానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యం కల్పించి అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.