తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు
61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల తనిఖీ.. రూ.6 లక్షల జరిమానా – రాత్రివేళ డ్రైవర్లకు “STOP & WASH” ద్వారా అవగాహన
తిరుపతి, సెప్టెంబర్ 15 (మన ప్రజావాణి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సురక్షిత ప్రయాణానికి తిరుపతి జిల్లా రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక రహదారి భద్రతా చర్యలు చేపట్టాయి. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు రాత్రివేళల్లో ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


