చెస్ పోటీల్లో నెమలిపురి విద్యార్థినుల ప్రతిభ
ఎంజీయూ స్థాయిలో ప్రథమ బహుమతి
సౌత్‌జోన్ పోటీలకు ఇద్దరు ఎంపిక
చింతలపాలెం సెప్టెంబర్ 11 ( ప్రజావాణి )
మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలో నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా ఉత్సవాల్లో చింతలపాలెం మండలం నెమలిపురి గ్రామానికి చెందిన విద్యార్థినులు చదరంగం చెస్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించారు.
ఎంజీయూలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న చింతా రెడ్డి త్రివేణి తన కళాశాల జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు క్రీడాకారులు సౌత్‌జోన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు నవంబర్‌లో హైదరాబాద్ వేదికగా జరగనున్న సౌత్‌జోన్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు.
యూనివర్సిటీ స్థాయిలో రాణించి గ్రామానికి మంచి పేరు తెచ్చిన త్రివేణిరెడ్డితో పాటు జట్టు సభ్యులను నెమలిపురి గ్రామస్థులు, కళాశాల అధ్యాపకులు, క్రీడాభిమానులు ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే సౌత్‌జోన్ పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు

