హామీల అమలు ప్రశ్నిస్తే..ముందస్తు అరెస్టులా?
చెన్నారావుపేట సెప్టెంబర్ 11 ప్రజావాణి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం నేరమా? అని చెన్నారావుపేట బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్ ప్రశ్నించారు.ఆశా వర్కర్లను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమని బోడ మురళి నాయక్ మండిపడ్డారు. ఆశ వర్కర్ల సమస్యలపై గళమెత్తినందుకు,శుక్రవారం చెన్నారావుపేట పోలీసులు మురళి నాయక్‌తో పాటు బీఆర్‌ఎస్ నర్సంపేట డివిజన్ కన్వీనర్ సదిరం వినయ్‌ను ముందస్తుగా అరెస్టు చేశారు.ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం, ఉద్యోగ, సామాజిక భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును అణచివేస్తూ అరెస్టులకు పాల్పడటం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.అరెస్టు చేసిన ఆశా వర్కర్లను వెంటనే విడుదల చేసి, వారిపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.ఆశా వర్కర్ల న్యాయమైన పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని మురళి నాయక్ స్పష్టం చేశారు.

