📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఅంగడిపేటలో కప్ప పెళ్లి ఫలించింది - ప్రశాంతంగా దంచికొట్టిన వర్షం - గ్రామస్తుల్లో ఆనందం

అంగడిపేటలో కప్ప పెళ్లి ఫలించింది – ప్రశాంతంగా దంచికొట్టిన వర్షం – గ్రామస్తుల్లో ఆనందం

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లా చండూర్ మండలం అంగడిపేట గ్రామంలో గ్రామస్తుల నమ్మకం నిజమైంది. గ్రామంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదనతో, గ్రామస్తులు ఇటీవల కప్పల పెళ్లి (మండూక వివాహం) వేడుకను ఘనంగా నిర్వహించారు. దేవుడు కరుణించి వర్షం కురిపించాలని పూజలు చేశారు. ఫలితం దక్కింది: గ్రామస్తుల ప్రార్థన ఫలించినట్లుగానే సోమవారం మధ్యాహ్నం అంగడిపేటలో ఒక్కసారిగా భారీ వర్షం దంచికొట్టింది. విశేషం ఏమిటంటే ఎలాంటి ఉరుములు, మెరుపులు లేకుండా ప్రశాంతంగా వర్షం కురవడం. “కప్ప పెళ్లి చేసినందుకే దేవుడు కరుణించి ఈ వర్షం కురిపించాడు, మా నమ్మకం నిజమైంది” అని గ్రామస్తులు ఆనందంతో చెబుతున్నారు. ఈ వర్షంతో వరి, పత్తి పంటలకు జీవం పోసినట్లయింది. గ్రామ చెరువు, కుంటల్లోకి కొత్త నీరు చేరింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.