నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ డి. విజయ శ్రీ ప్రతిష్టాత్మక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బాలికల విద్యాభివృద్ధికి ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు గ్రహీత డి. విజయ శ్రీ మాట్లాడుతూ… “ఈ అవార్డు నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఒక్కదాని విజయం కాదు, మా కెజీబీవీ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు, తల్లిదండ్రులందరి కృషి ఫలితం. బాలికల విద్య కోసం, వారి భవిష్యత్తు కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన విద్యాశాఖ అధికారులకు, ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది. గుర్రంపోడు కేజీబీవీ లో విద్యార్థినుల ఎన్రోల్మెంట్ పెంచడం, 100% హాజరు, మెరుగైన ఫలితాల సాధనలో విజయ శ్రీ పాత్ర కీలకమని తోటి ఉపాధ్యాయులు, మండల ఎడ్యుకేషన్ ఆఫిసర్ కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు ఆమెకు ఘనంగా అభినందనలు తెలిపారు.

