రచ్చగల్లి ప్రాథమిక పాఠశాలలో ఆకట్టుకున్న గురుపూజోత్సవ వేడుకలు.
కే.కృష్ణమోహన్ సార్ కు అపూర్వ సత్కారం.
గురుభక్తి చాటుకున్న పూర్వ విద్యార్థులు.
ఉపాధ్యాయునికి పాదాభివందనం,ఘన సన్మానం.
పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన కృష్ణమోహన్‌కు పూర్వ విద్యార్థుల శుభాకాంక్షలు.


కోటగిరి/ప్రజావాణి:-ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోటగిరి మండల కేంద్రంలోని రచ్చగల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కే.కృష్ణమోహన్‌కు పూర్వ విద్యార్థులు శనివారం ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా గురుభక్తిని చాటుకుంటూ ఆయనకు పాదాభివందనం చేసి,శాలువాతో సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల కాలంలో పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా కూడా పూర్వ విద్యార్థులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.ఉపాధ్యాయ దినోత్సవ వేళ మా గురువుగారిని సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం.ఉపాధ్యాయ వృత్తిలో మా గురువు సేవలు మరువలేనివని.పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షులుగా నియామకం కావడం మాకెంతో గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మా గురువు కే.కృష్ణమోహన్ సర్ మంచి పదవులు చేపట్టి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తేవాలని మనసారా ఆకాంక్షించా రు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పత్తి.సతీష్, ఏముల.నవీన్,ఆలపాటి హరికృష్ణ,నీరడి.భూమయ్య, కప్ప.సాయిలు,వై.అనిల్,రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ కులకర్ణి, సీనియర్ నాయకురాలు శ్యామల కులకర్ణి,సీనియర్ నాయకులు మార్కెల్లి ప్రకాష్ పటేల్,పిఆర్టియు కోటగిరి మండల ప్రధాన కార్యదర్శి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు డీ.ఉదయ చందర్,ఉపాధ్యాయ బృందం,పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

