📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaగుర్రంపోడు లిటిల్ చాంపియన్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

గుర్రంపోడు లిటిల్ చాంపియన్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ లిటిల్ చాంపియన్ స్కూల్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరిగాయి. స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులచే ఉట్టి కొట్టే కార్యక్రమం, భగవద్గీత శ్లోక పఠనం, సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ – “పిల్లలలో చిన్ననాటి నుండే మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతో పాటు, శ్రీకృష్ణుని ఆదర్శాలను భావితరాలకు అందించడమే ఈ వేడుకల లక్ష్యం” అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. చివరిలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ వేడుకల్లో రొండి వెంకన్న, ఇంచార్జి కడారి స్వామి, విజయ్ మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బండారు ఉపేందర్, రాజు, సుమన్, పరిమళ, చంద్రకళ, అఖిల, షబానా, సుబ్బి, శిల్పి, సొనాలి, తపస్విని, సొనాలి, లోరా, నీలిమ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.