📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriప్రేమ అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్

ప్రేమ అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్

📰 Generate e-Paper Clip

ప్రేమానుబంధాలకు ప్రతీక రక్షాబంధన్

మహిళలకు, అమ్మలకు, అక్కాచెల్లెళ్లకు హృదయపూర్వక రాఖీ శుభాకాంక్షలు

కుండ భానుచందర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు, గుండ్లపోచంపల్లి 299 డివిజన్

మేడ్చల్, గుండ్లపోచంపల్లి: అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అపురూపమైన అనుబంధం, ప్రేమాభిమానాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండగే రక్షాబంధన్ (రాఖీ పండగ) అని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ పేర్కొన్నారు. రాఖీ పండగ కేవలం సోదరుడి చేతికి సోదరి కట్టే ఒక దారం మాత్రమే కాదని, జీవితాంతం ఒకరికి ఒకరు అండగా నిలిచే ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. చెల్లెలికి ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటాననే భరోసాను అన్న అందించే గొప్ప సందేశాన్ని రక్షాబంధన్ అందిస్తుందని తెలిపారు.

ఈ పవిత్రమైన పర్వదినాన్ని పురస్కరించుకుని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల మహిళామూర్తులకు, అమ్మలకు, తన ప్రియమైన అక్కాచెల్లెళ్లందరికీ కుండ భానుచందర్ హృదయపూర్వక రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి ఇంట్లో ప్రేమానురాగాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్నాచెల్లెళ్ల బంధం మరింత బలపడాలని కోరుకుంటూ రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.