📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguమహిళల రక్షణే మా భాద్యత

మహిళల రక్షణే మా భాద్యత

📰 Generate e-Paper Clip

 

పసర ఎస్ఐ తాజుద్దీన్ కు రాఖీ కట్టిన మహిళలు

గోవిందరావుపేట (ప్రజావాణి):-

పసర: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని పసర పోలీస్ స్టేషన్ లో ఆత్మీయ వేడుక జరిగింది.
పసర సబ్ ఇన్ స్పెక్టర్ ఎస్.కె. తాజుద్దీన్ గారికి పలువురు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీస్ స్టేషన్ లోని ఆయన ఛాంబర్ లో ఈ కార్యక్రమం ఎంతో సంతోషకర వాతావరణంలో జరిగింది.
మహిళలు ఒకరి తర్వాత ఒకరు ఎస్ఐ చేతికి ప్రేమతో రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ తాజుద్దీన్ మహిళలకు తోబుట్టువుగా అండగా ఉంటానని హామీ ఆడబిడ్డల రక్షణే తమ బాధ్యత అని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా స్టేషన్ కు రావచ్చని సూచించారు.
అనంతరం మహిళలకు మిఠాయిలు తినిపించి, స్వయంగా కవర్లు అందజేసి ఆనందాన్ని పంచుకున్నారు.
అక్కడే ఉన్న సిబ్బంది, స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు.
రాఖీ పండుగ అనేది కేవలం దారం కాదు, రక్షణకు ఇచ్చే మాట అని ఎస్ఐ అన్నారు.
పసర మండలంలో మహిళలకు ఎల్లప్పుడూ భరోసాగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఎస్ఐ తాజుద్దీన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసులు – ప్రజల మధ్య ఇలాంటి ఆత్మీయ సంబంధాలు సమాజానికి ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.

By శ్రీకాంత్ ప్రజావాణి ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.