ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ విలేకరుల తరఫున హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
అక్కాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి
ఎల్కతుర్తి మండల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి
గౌరవ అధ్యక్షులు కందుకూరి రాజన్న.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
అన్నాచెల్లెళ్లు,అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు,ఆత్మీయ అనుబంధం,పరస్పర విశ్వాసానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ఎల్కతుర్తి మండలంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ విలేకరుల తరఫున హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
రాఖీ పౌర్ణమి రోజున సోదరీమణులు తమ సోదరులకు ప్రేమతో రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను ఆకాంక్షిస్తారు. సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇస్తూ కానుకలు అందించడం ఈ పండుగలో ముఖ్యమైన సంప్రదాయం. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ఆనందంగా పండుగను జరుపుకోవడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి.
రాఖీ పౌర్ణమి కేవలం రాఖీ కట్టుకునే పండుగ మాత్రమే కాకుండా అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని, ప్రేమను, ఆప్యాయతను గుర్తు చేసే పవిత్రమైన కుటుంబ పండుగ. నేటి ఆధునిక జీవన విధానంలో బంధాలు, ఆత్మీయతలు మరింత బలపడాల్సిన అవసరం ఉంది. ఈ పండుగ ప్రతి ఒక్కరిలో ప్రేమ, ఐక్యత, పరస్పర గౌరవం, కుటుంబ విలువలను పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాం.
ఈ పవిత్ర రాఖీ పౌర్ణమి పండుగ ఎల్కతుర్తి మండలంలోని ప్రతి కుటుంబంలో ఆనందం, ఐక్యత, సుఖసంతోషాలను నింపాలని, అన్నాచెల్లెళ్ల అనుబంధం కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మండలంలోని ప్రతి అక్కాచెల్లెమ్మకు, అన్నదమ్ములకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ మరియు ప్రెస్ క్లబ్ విలేకరుల తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి గౌరవ అధ్యక్షులు కందుకూరి రాజన్న ఉపాధ్యక్షులు చిర్ర ఉదయచందర్,శ్రీరామోజు సతీష్ చారి,ప్రధాన కార్యదర్శి సిద్ధాంతి నిరంజన్ కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్ జూపాక శ్రీనివాస్ ప్రచార కార్యదర్శి నల్లరాజిరెడ్డి.కార్యవర్గ సభ్యులు నరేష్ బెజ్జెంకి, బొంకూరి వంశీ,కర్రె తిరుపతి,కార్యవర్గ సభ్యులు ఎర్రోళ్ల రాజబాబు కార్యవర్గ సభ్యులు అడ్డూరి అనిల్,అంబాల ప్రవీన్ కార్య వర్గ సభ్యులు ఎర్రోళ్ల సతీష్ క్లబ్ సభ్యులు చిలుముల ప్రమోద్ క్లబ్ సభ్యులు కుందుర్తి సదానందం క్లబ్ సభ్యులు అడ్డూరి శ్రీకాంత్ క్లబ్ సభ్యులు సుద్దాల జయప్రసాద్ క్లబ్ సభ్యులు
పాల్గొన్నారు.

