📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadపోతంగల్లో ఘనంగా మీలాద్‌ ఉన్‌ నబి వేడుకలు.

పోతంగల్లో ఘనంగా మీలాద్‌ ఉన్‌ నబి వేడుకలు.

📰 Generate e-Paper Clip

పోతంగల్లో ఘనంగా మీలాద్‌ ఉన్‌ నబి వేడుకలు.

కోటగిరి/ప్రజావాణి:-పోతంగల్ మండల కేంద్రంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మీలాద్ ఉన్ నబి వేడుకలను బుధవారం ప్రజా ప్రతినిధులు,ఆయా పార్టీల నాయకులు,మైనార్టీ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించారు.దీంతో మండల కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు,ప్రజా ప్రతి నిధులు పాల్గొని ముస్లిం సోదరులకు మీలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు అందజేశారు.గ్రామంలో శాంతి,సౌభ్రాతృత్వాలు విలసిల్లాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు జుమ్మా ఖాన్,నభీ,సందాని,రమేష్ సేట్,విఠల్,వీరేశం,డాక్టర్ ఎం.ఎ.హకీం,గఫ్ఫార్,ఫిరదోస్ ఖాన్,సుల్తాన్ లతో పాటు గ్రామ ముస్లిం సోదరులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.