📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅవుషాపూర్‌లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి...వారం రోజుల్లో పరిష్కరించకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా: నాయకులు, గ్రామస్థుల...

అవుషాపూర్‌లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి…వారం రోజుల్లో పరిష్కరించకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా: నాయకులు, గ్రామస్థుల హెచ్చరిక

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, ఆగస్టు 25: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఉప్పల్ జోన్, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని 7వ డివిజన్ ఎదులాబాద్‌లోని అవుషాపూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు, యువకులు ఘట్కేసర్ విద్యుత్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా గ్రామంలో తరచూ విద్యుత్ కోతలు, తక్కువ వోల్టేజీ, సరఫరాలో అంతరాయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్కువ వోల్టేజీ కారణంగా విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని, మోటార్లు సక్రమంగా పనిచేయక తాగునీటి సరఫరాపై కూడా ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని, పాత విద్యుత్ లైన్లను ఆధునీకరించి మౌలిక వసతులను మెరుగుపరచాలని అధికారులను కోరారు.

వారం రోజుల్లోగా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఘట్కేసర్ విద్యుత్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని నాయకులు, గ్రామస్థులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ఘట్కేసర్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, అవుషాపూర్ మాజీ ఉపసర్పంచ్ ఎలుసాని ఐలయ్య యాదవ్, మాజీ గ్రామపంచాయతీ సభ్యులు బొడిగె శ్రీనివాస్ గౌడ్, కొలిచేలిమే వీరేశం, కందకట్ల దయాకర్ రెడ్డి, నాయకులు ముద్దం లక్ష్మణ్ యాదవ్, జిల్లాల మల్లికార్జున్, గ్రామ యువకులు గుర్రం వినయ్ రెడ్డి, చిల్కమరి మహేష్, సత్యనారాయణ, జిల్లాల ప్రభాకర్, ఎలుసాని వీరేష్ యాదవ్, సురేష్ యాదవ్, ఎలుసాని చిన్న యాదవ్, అమిదాల రమేష్, డొంకెనీ ప్రభాకర్, అమిదాల భిక్షపతి గౌడ్, డొంకెనీ భాస్కర్ గౌడ్, ఉట్కూరి భార్గవ్, అమిదాల రమేష్ గౌడ్, డొంకెనీ అరవింద్, అమిదాల ప్రభాకర్ గౌడ్, మర్రి చెన్నారెడ్డి, కాసుల నరేష్‌తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.