📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaహసన్‌పర్తిలో విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. వార్డెన్‌పై పోక్సో కేసు

హసన్‌పర్తిలో విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. వార్డెన్‌పై పోక్సో కేసు

📰 Generate e-Paper Clip

హసన్‌పర్తిలో విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. వార్డెన్‌పై పోక్సో కేసు

మన ప్రజావాణి న్యూస్ | హసన్‌పర్తి

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డెన్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

వార్డెన్ ప్రవర్తనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. విద్యార్థినుల భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.