•శ్రీవారి దర్శనం కోసం 22వ మహా పాదయాత్ర..
*భక్తులతో కలిసి పాల్గొన్న మాణిక్ యాదవ్
అమీన్పూర్, ఆగస్టు 17 (ప్రజావాణి): శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 22వ మహా పాదయాత్రలో హైకోర్టు అడ్వకేట్, యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. కిష్టారెడ్డిపేట్ దుర్గామాత ఆలయం నుంచి తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వరకు టీ. మాణిక్యం ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగింది.
గోవింద నామస్మరణతో సాగిన ఈ మహా పాదయాత్రలో మాణిక్ యాదవ్ భక్తులతో కలిసి పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తితో వేసే ప్రతి అడుగు మనసుకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. భగవంతునిపై విశ్వాసంతో నిర్వహించే ఇలాంటి పాదయాత్రలు భక్తుల్లో ఐక్యత, సేవాభావం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, ప్రసాద్‌తో పాటు కిష్టారెడ్డిపేట్, పరిసర గ్రామాల నుంచి తరలివచ్చిన మహా పాదయాత్ర భక్తులు, నాయకులు పాల్గొన్నారు.

