📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadబిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

 

 

కాంగ్రెస్‌ పార్టీ లో చేరిన పోగుల్లపల్లి బిఆర్ఎస్ గ్రామ కమిటీ మాజీ కార్యదర్శి

 

 

 

కొత్తగూడ మండల ప్రతినిధి:- ఆగస్టు 16. (మన సమగ్ర ప్రజావాణి:- మహబూబాబాద్ జిల్లా

కొత్తగూడ మండలం పోగుల్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పోగుల్లపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కమిటీ కార్యదర్శి ఊళ్లేంగుల ఎల్లయ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ రూపు సింగ్, ​స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనకు పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ​కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు సదరు నాయకుడు తెలిపారు. ​గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో సర్ ఇంచార్జ్ వజ్జ సారయ్య, బ్లాక్ అధ్యక్షుడు సుంకర బోయిన మొగిలి, రూరల్ డేవలప్ మెంట్ డైరెక్టర్ చల్ల నారాయణ రెడ్డి, గద్ద అశోక్, డ్యాగల భద్రయ్య, మాజీ జడ్పీటీసీ పులసం పుష్పలత, సర్పంచ్ నూనావత్ ఈర్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.