📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyతాలేల్మ గ్రామంలో ఘనంగా ముదిరాజ్ బోనాల వేడుకలు

తాలేల్మ గ్రామంలో ఘనంగా ముదిరాజ్ బోనాల వేడుకలు

📰 Generate e-Paper Clip

తాలేల్మ గ్రామంలో ఘనంగా ముదిరాజ్ బోనాల వేడుకలు

మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 08 (తాలెల్మా) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

అందోల్ మండలంలోని తాలేల్మ గ్రామంలో ముదిరాజ్ బోనాల సందర్భంగా గ్రామదేవత అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ ఉపాధ్యక్షులు పి. నారాయణ, మాజీ సర్పంచ్ లింగ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పండించిన పంటలు చేతికొచ్చి రైతాంగం, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
బోనాల ఉత్సవాల్లో భోగిని సత్యం, ముదిరాజ్ కుల బంధువులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో భక్తిశ్రద్ధల మధ్య బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular