ఆప్కారి శాఖపై
తీరుపై ఆగ్రహం
బెల్ట్ షాపులకు లైసెన్స్ ఇచ్చారా అంటూ ప్రశ్నించిన కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్
ప్రజావాణి 6 ఆగస్టు ప్లే కార్డ్ ప్రదర్శిస్తూ మండల సర్వసభ్య సమావేశంలో నిరసన వ్యక్తం చేసిన సర్పంచ్ పబ్బు సతీష్
కమలాపూర్ ఆప్కారి శాఖ నిర్లక్ష్యపు పనితీరుపై కమలాపూర్ సర్పంచ్ బీంపెల్లి సహా ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఆప్కారి శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఖండిస్తూ కమలాపూర్ సర్పంచ్ నిరసన వ్యక్తం చేశారు సమయపాలన లేకుండా రాత్రి పగలు అక్రమంగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు సాగుతుండడంతో అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని అనేక కుటుంబాలు ఆగమవుతున్నాయని బెల్ట్ షాపులు నిషేధించాలని మహిళా అభ్యర్థన మేరకు కమలాపూర్ లో బెల్ట్ షాపులో నిషేధిస్తూ తీర్మానం చేయగా కొందరు తీర్మానాన్ని ధిక్కరించి అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు అని సర్పంచ్ ఆరోపించారు అదే విషయాన్ని సంబంధించి ఆప్కారి పోలీసులకు అనేకసార్లు వినతి పత్రం ఇచ్చిన సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బెల్ట్ షాపులు అరికట్టాల్సిన ఆప్కారి అధికారులే చోద్యం చూస్తూ బెల్టు షాపులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ఆప్కారి శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి షాపులను పూర్తిగా లేకుండా చేయాలని లేకుంటే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు మాట్లాడుతూ కమలాపూర్ గ్రామపంచాయతీ బెల్ట్ షాపుల నిషేధం చేసిన తర్వాత మండలంలో అనేక గ్రామాలు బెల్ట్ షాపులో నిషేధిస్తూ తీర్మానం చేశాయి కమలాపూర్ మండలాన్ని ఆదర్శంగా తీసుకొని అనేక గ్రామపంచాయతీ షాపుల్లో నిషేధిస్తూ తీర్మానం చేశాయి విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రమ్ కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒకసారి శాఖ అధికారులు మామూళ్ల మత్తులో బెల్ట్ షాపులను పట్టించుకోవడం వదిలేశారని ఆరోపించారు ఇప్పటికైనా ఆప్కారి అధికారులు బెల్ట్ షాపులను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే అన్ని పార్టీలతో కలుపుకొని ఆందోళన చేస్తామన్నారు





